నెల్లూరు జిల్లాలో చెదలు పట్టిన బ్యాలెట్ పేపర్లు, అటు కొన్ని జిల్లాల్లో వర్షపు నీటికి తడిసిన బ్యాలెట్ పేపర్లను అధికారులు పరిశీలిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి చెప్పారు. అవి కౌంటింగ్ కు పనికి రావని అనుకుంటే తప్పకుండా రీపోలింగ్ నిర్వహిస్తామని, అభ్యర్థులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు.