కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం దేవగుడిలో రీపోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 80, 81, 82 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వ్యక్తిగతంగా పోలింగ్ కేంద్రాల వద్దే ఉండి పోలింగ్ ను పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.