మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి పార్థివ దేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. నెల్లూరు జిల్లా వాకాడు సమీపంలోని స్వర్ణముఖీ నదీ తీరంలో అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.