తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో 48 గంటల పాటు రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. రాయలసీమ, తెలంగాణల్లో పలు చోట్ల, కోస్తాంధ్రలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయి. దట్టమైన క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడటంతో... పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం కురిసే సమయంలో ఈదురుగాలులు కూడా వీస్తాయి.