తనను ప్రేమించి... మరొకరితో పెళ్లికి సిద్ధమైన ప్రియురాలిని చూసి అసూయ పడ్డాడు. మరికాసేపట్లో వివాహం జరగాల్సి ఉండగా ఆమె ఉసురుతీశాడు. భోపాల్ లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. భోపాల్ లోని లాల్ ఘటీ ప్రాంతంలో డాక్టర్ రోహిత్, డాక్టర్ జయశ్రీ నామ్ దియోల పెళ్లివేడుక జరుగుతోంది. కాబోయే వధూవరులను బంధుమిత్రులు ఆశీర్వదిస్తుండగా... ఉన్నట్టుండి ఓ వ్యక్తి రిసెప్షన్ వేదికపైకి వచ్చాడు. నేరుగా వధువు వద్దకు వచ్చి... ఆమెపై మూడుసార్లు కాల్పులు జరిపాడు. దీంతో ఏం జరిగిందో అర్థం కాక అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. తేరుకునేలోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. పెళ్లికూతురిని ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని డాక్టర్లు చెప్పారు. కాగా తనను ప్రేమ పేరుతో మోసం చేసినందుకే జయశ్రీని చంపినట్టు ప్రియుడు అనురాగ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు.