విజయవాడలో ఇవాళ వర్షం కురవడంతో పోలింగ్ కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో క్యూలైన్లలో నిలుచున్న ఓటర్లు తడిసిపోయారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు ఏర్పాటు చేసిన షామియానాలు కూడా కూలిపోయాయి. దీంతో ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు. కొందరు వర్షంలో తడుస్తూనే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.