అనంతపురం జిల్లా తాడిపత్రిలో విషాద సన్నివేశం చోటు చేసుకుంది. ఓటేసేందుకు వెళ్లిన ఓ మహిళ గుండెపోటుతో కుప్పకూలింది. ఆమెను ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందింది. దీంతో తాడిపత్రి పోలింగ్ కేంద్రంలో సిబ్బందితో సహా ఓటర్లు కూడా విచారంలో మునిగిపోయారు.