: అళగిరిని పార్టీ పదవుల నుంచి తొలగించిన కరుణానిధి

పార్టీపై వ్యతిరేక బావుట ఎగురవేస్తున్న పెద్ద కుమారుడు అళగిరిపై డీఎంకె అధినేత కరుణానిధి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అళగిరిని పార్టీ పదవుల నుంచి తొలగించినట్లు ప్రకటించారు. డీఎండీకేతో డీఎంకె పొత్తును అళగిరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానిపై అప్పుడే మండిపడిన కరుణ... క్రమశిక్షణ తప్పితే చర్యలు తీసుకోవల్సి ఉంటుందని హెచ్చరికలు కూడా చేశారు. అయినా అళగిరి ఏమాత్రం ప్రవర్తన మార్చుకోకపోవడంతో కరుణ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

More Telugu News