: నేను కూడా రాజ్యసభ రేసులో ఉన్నా: నన్నపనేని

రాజ్యసభ పదవిపై ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కూడా ఆశలు పెట్టుకున్నారు. ఈ మేరకు తాను కూడా టీడీపీ నుంచి రాజ్యసభ రేసులో ఉన్నానంటూ తెలిపారు. తనకు అసెంబ్లీ నియోజకవర్గం లేనందున, రాజ్యసభకు తన పేరును పరిశీలించాలని అధినేత చంద్రబాబును కోరనున్నట్లు చెప్పారు. అటు సీనియర్ కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డిని కూడా రాజ్యసభ రేసులో ఉంచేందుకు సమైక్యవాదులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పదకొండు మంది శాసనసభ్యులు ఇప్పటికే సంతకాలు చేశారు.

More Telugu News