సినీ నటులు రాజశేఖర్ దంపతులు భారతీయ జనతాపార్టీ (బీజేపీ) తీర్థం పుచ్చుకోనున్నారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న వీరు టీడీపీలో చేరుతారనే వార్తలు వచ్చాయి. అయితే రాష్ట్ర విభజన నిర్ణయంలో వచ్చిన వ్యతిరేకత దృష్ట్యా వీరు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలిసింది. ప్రస్తుతం దేశంలో మోడీ ప్రభంజనాన్ని చూసే జీవితా రాజశేఖర్ లు బీజేపీలో చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

గుజరాత్ లో సర్ధార్ వల్లభాయి పటేల్ విగ్రహ ఏర్పాటుపై దక్షిణాది రాష్ట్రాల నాయకులతో బీజేపీ ఇటీవల హైదరాబాదులో ఒక వర్క్ షాప్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి జీవిత, రాజశేఖర్ హాజరయ్యారు. అప్పటి నుంచి వీరు కమలదళం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయమై వివరణ కోరగా.. త్వరలో బీజేపీలో చేరుతున్నామని జీవిత, రాజశేఖర్ చెప్పారు.