మీడియా వైఖరితో నటుడు హృతిక్ రోషన్ కు చిర్రెత్తుకొచ్చింది. భార్య సుసానేతో బంధానికి బ్రేకులు పడ్డ తర్వాత జుహూలో ఒక అపార్ట్ మెంట్ తీసుకున్నాడని వస్తున్న వార్తలపై విలేకరులు హృతిక్ రోషన్ ను ప్రశ్నించారు. 'నేను ముంబైలో రెండు ఫ్లాటులు కొంటే.. గోవాలో ఫ్లాట్ కొంటే.. ప్రపంచవ్యాప్తంగా 10 ఇళ్లు కొంటే ఏంటి..? ఇది మీకు సంబంధించినదా? మీ ఇష్టం వచ్చినట్లు రాయకండి' అని మండిపడ్డారు. తాను ప్రస్తుతమున్న ఇంటి నుంచి మారడం లేదని స్పష్టం చేశారు.