హైదరాబాదులోని మంత్రి జానారెడ్డి ఛాంబర్ లో తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. బిల్లు, సవరణలు, శాసనసభలో ఓటింగ్ విషయమై వీరు చర్చిస్తున్నారు. బిల్లులో సవరణలపై ఓటింగ్ కు అవకాశం ఉంటుంది కాబట్టి, సభలో బిల్లుపై ఓటింగ్ కు అంగీకరించకూడదని తెలంగాణ ప్రాంత నేతలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.