హీరో ఉదయ్ కిరణ్ మృత దేహాన్ని శ్రీనగర్ కాలనీలోని ఆయన నివాసం నుంచి ఫిలిం ఛాంబర్ కు తరలించారు. అంతకు ముందు ఉదయ్ కిరణ్ మృత దేహాన్ని చూడాలని ఆయన ఇంటి వద్ద అభిమానులు ఆందోళన చేపట్టారు. ఈ మధ్యాహ్నం 12 గంటల అనంతరం ఆయన భౌతికకాయాన్ని ఎర్రగడ్డ శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలను నిర్వహిస్తారు.