మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అపాయింట్ మెంట్ కోరారని మాజీ మంత్రి గుండ అప్పలనాయుడు తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ ధర్మాన పార్టీ మారుతున్నారంటూ వస్తున్న ఆరోపణలు వాస్తవమో కాదో వేచి చూస్తే తెలుస్తాయని ఆయన అన్నారు. విభజన బిల్లును తెచ్చి కాంగ్రెస్ పార్టీ జిల్లాలో తుడిచిపెట్టుకుపోయిందని, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలిపోయాయని ఆయన అన్నారు.