తెలగ, బలిజ, కాపులను బీసీ జాబితాలో చేర్పించేందుకు కృషి చేస్తానని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. హైదరాబాదులోని గాంధీ భవన్ లో ఆయన ఇవాళ (సోమవారం) కాపు నేతలతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ అంశంపై చర్చించి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని కాపు ఎమ్మెల్యేలు, కాపు నేతలతో కలసి సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తామని ఆయన చెప్పారు.