శాసనసభ సమావేశాల్లో స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్వల్ప మార్పులు చేశారు. ఈ నెల 16కు బదులుగా 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవనున్నాయి. ముసాయిదా బిల్లుపై చర్చ జరగాల్సి ఉండటంతో ఈ నెల 18న శనివారం కూడా శాసనసభ నిర్వహించనున్నారు.