ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలని ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఓయూ విద్యార్థులు ర్యాలీగా బయల్దేరి అసెంబ్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎన్ సీసీ గేట్ వద్దకు చేరుకున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.