ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన అనంతరం అరవింద్ కేజ్రీవాల్ పలుమార్లు కేంద్ర హోంశాఖ సమకూర్చిన భద్రతను తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ఎప్పటికీ తాను భద్రత తీసుకోనని స్పష్టం చేశారు. తమ(పార్టీ) సిద్ధాంతాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. తను దేనికీ భయపడటం లేదని, ప్రజల మంచికోసమే పని చేస్తానని తెలిపారు. కేజ్రీవాల్ క్యాబినెట్ లో మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి రాఖీ బిర్లా నిన్న(ఆదివారం) తన సొంత కారులో వెళుతుండగా కొంతమంది దుండగులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన పైవిధంగా అన్నారు.