రవాణాశాఖ అధికారులు ఈ రోజు హైదరాబాద్ లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల తనిఖీలు చేపట్టారు. అమీర్ పేటలో తనిఖీలు చేస్తున్న సిబ్బందిపైకి జబ్బార్ ట్రావెల్స్ బస్సు దూసుకుపోయింది. దీంతో రవాణా శాఖ కానిస్టేబుల్ చౌదరికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న 11 బస్సులపై కేసులు నమోదు చేశారు.