నల్గొండ జిల్లాలోని అనాధాశ్రమంలో పలువురు బాలికలపై లైంగిక వేధింపులు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హరీష్ నాయక్ ను పోలీసులు అరెస్టు చేసి నిర్భయ చట్టంతో పాటు 12 సెక్షన్లపై కేసులు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ ప్రభాకర్ తెలిపారు. హరీష్ నిర్వహిస్తున్న వసతిగృహంపై కలెక్టర్ కు పూర్తి నివేదిక అందజేస్తామని ఆయన అన్నారు. మరో వైపు బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ ను గ్రామస్థులు, విద్యార్ధి సంఘాల ప్రతినిధులు నిందితులపై ఏ చర్యలు తీసుకున్నారంటూ నిలదీశారు. బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.