కేరళలోని కోచిలోని పుత్తువైపే వద్ద 4,200 కోట్ల రూపాయలతో నిర్మించిన పెట్రోనెట్ ఎల్ఎన్ జీ టెర్మినల్ ను ప్రధాని మన్మోహన్ సింగ్ జాతికి అంకితం చేశారు. దేశంలో పెరుగుతున్న పెట్రో అవసరాల దృష్ట్యా ఈ టెర్మినల్ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.