గోవాలోని కనాకోనాలో నిర్మాణంలో ఉన్న భవంతి కూలిన ఘటనలో ఎనిమిది మంది కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది. భవనం కూలిన సమయంలో నలభై మంది కార్మికులు శిథిలాల కింద ఉండిపోయారు. వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టి చిక్కుకుపోయినవారిని బయటకు తీస్తున్నారు. వారిలో చాలామందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.