హైదరాబాద్ అడిక్ మెట్ ప్రాంతంలో ఉన్న వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో విగ్రహం నల్లగా మసిబారిపోవడమే కాకుండా, పగుళ్లు కూడా ఇచ్చింది. ఈ ఉదయం జరిగిన ఘటనను తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.