ఇద్దరు తెలివైన ప్రయాణికులు నిరంజన్ షా, శివకుమార్ హాంగ్ కాంగ్ నుంచి చెన్నై విమానాశ్రయంలో దిగారు. కస్టమ్స్ అధికారులు పట్టుకోకుండా తమ సూటు కేసు హ్యాండిల్ లోపల అరకేజీకి పైగా బరువున్న బంగారం బిస్కెట్ ను దాచిపెట్టారు. కానీ, అధికారులు అలాంటి జాదూలను ఎంతోమందిని చూసుంటారు కదా.. ఇట్టే పట్టేశారు. దాని విలువ 15లక్షల రూపాయల వరకు ఉంటుంది.