ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కేసుపెడతానని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో ఫైళ్లపై సంతకాలు పెడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అక్రమార్జనకు తెరతీశారని అన్నారు. భారీ ఎత్తున వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్న సీఎంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో కేసువేస్తానని అన్నారు.