తిరుమల శ్రీవారిని రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి ఈ రోజు దర్శించుకున్నారు. వేకువజామున స్వామివారి అభిషేక సేవలో వీరిద్దరూ పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో గవర్నర్ దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం పలికారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు స్వామివారి తీర్ధ ప్రసాదాలను, నూతన సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను గవర్నర్ నరసింహన్ కు అందజేశారు. అనంతరం నేరుగా తిరుచానూరు చేరుకున్న గవర్నర్ దంపతులు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.