బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం 'షోలే' త్రీడీ రూపంలో రేపు (శుక్రువారం) విడుదలయ్యేందుకు సిద్ధమైంది. దర్శకుడు రమేశ్ సిప్పీ రూపొందించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమామాలిని, జయ బాధురి ఇంకా పలువురు నటించగా, 1970లలో సంచలనం సృష్టించింది. రమేశ్ సిప్పీ సొదరుడి కుమారుడు షాషా సీప్పీ ప్రస్తుతం ఈ సినిమాను త్రీడీ రూపంలో తీసుకొస్తున్నాడు. త్రీడీ విడుదల కోసం హిందీ అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.