కీచక సంతతి అకృత్యాలకు అబలల జీవితాలు నాశనమైపోతున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గూతలబండలో నలుగురు మృగాళ్ల పశు వాంఛకు ఓ గిరిపుత్రిక బలైంది. నలుగురు అత్యాచారం చేయడంతో బాధితురాలు చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.