మంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్చడంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సీపీఐ నారాయణ తప్పుబట్టారు. కీలకమైన సమయంలో శాఖ మార్చడం ద్వారా సీఎం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కారన్నారు. అయితే, తెలంగాణ విషయంలో బీజేపీ వంచక పాత్ర పోషిస్తోందని విమర్శించారు. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ అంశంపై సమగ్ర చర్చ జరగాలన్నారు.