అవినీతిపై చర్చకు రావాలంటూ టీడీపీని వైఎస్సార్సీపీ నేత మైసూరారెడ్డి పిలవడంపై ఆ పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ లోటస్ పాండేనని... అలాంటిది చర్చకు రమ్మంటూ మైసూరా పిలవడం ఓ పెద్ద జోక్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ 43 వేల కోట్ల అవినీతికి పాల్పడటం నిజమా? కాదా? అనే విషయాన్ని మైసూరా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సొమ్మును దోచుకున్నందుకే జగన్ జైలుకు వెళ్లి వచ్చాడని ఎద్దేవా చేశారు. జగన్ కు తన ఆస్తులను ప్రకటించే దమ్ము కూడా లేదని విమర్శించారు.