రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో తొలిసారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2014 జనవరి 1 నుంచి ఐఆర్ వర్తిస్తుందని, త్వరలో పీఆర్ సీ పూర్తి చేస్తామని చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు ముగిసిన అనంతరం మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడారు. కాగా, ఉద్యోగులు, పింఛన్ దారులకు నగదు రహిత వైద్యానికి ఉద్దేశించిన ఆరోగ్య కార్డులపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని... దీనికోసం స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తామని కిరణ్ వివరించారు. ఆరోగ్య కార్డుల వల్ల 14 లక్షల 70వేల కుటుంబాలకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు.