మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన బస్సు కల్యాణ్, అహ్మద్ నగర్ రూట్లో మల్షేస్ ఘాట్ వద్ద 250 మీటర్ల లోయలోకి పడిపోయింది. 20 మంది వరకూ మరణించగా.. 24 మంది వరకూ గాయపడ్డారని సమాచారం. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.