అమెరికాలో భారత దౌత్యాధికారిణి దేవయాని ఖోబ్రగడేను ఐక్యరాజ్యసమితికి బదిలీ చేసిన దరఖాస్తు ఇప్పటికీ పరిశీలనలోనే ఉన్నట్టు యూఎస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవడానికి తుదిగడువంటూ ఏమీ లేదని చెప్పారు. సాధారణంగా ఇలాంటి దరఖాస్తులపై వేగవంతగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ, దేవయాని విషయంలో మాత్రం నత్తనడకన సాగుతోంది. దేవయాని ఐరాసకు బదిలీ అయితే, ఆమెకు దౌత్యపరమైన పూర్తి రక్షణ లభిస్తుంది.