ఈ నెల 11వ తేదీన శ్రీ వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) సందర్భంగా భద్రాచలం రామాలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ముక్కోటి ఏకాదశికి భద్రాద్రి రామయ్యను దర్శించుకొనేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తోన్న విషయం విదితమే. గోదావరిలో పుణ్యస్నానాలాచరించి వచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తిచేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నిన్న (బుధవారం) ప్రారంభమైన అధ్యయనోత్సవాలతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఆలయంలో అలంకరించిన విద్యుత్ దీపాల ధగధగలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.