తెలంగాణ ప్రక్రియ కీలక దశకు చేరుకున్న సమయంలో, తనను శాసనసభా వ్యవహారాల శాఖ నుంచి తప్పించడంపై మంత్రి శ్రీధర్ బాబు గుర్రుగా ఉన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయడానికి ఆయన నిన్ననే సిద్ధమయ్యారు. అయితే సీనియర్ మంత్రి జానా రెడ్డి కలగజేసుకుని శ్రీధర్ బాబుకు సర్దిచెప్పారు. శ్రీధర్ బాబు మాత్రం రాజీనామా విషయంలో రాజీపడేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలని ఆయన డిసైడ్ అయినట్టు సమాచారం. తన రాజీనామాను నేరుగా ముఖ్యమంత్రికి ఇవ్వకుండా, ఫ్యాక్స్ ద్వారా పంపించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంత నేతలను చులకన భావంతో చూస్తున్నారని, తోటి టీమంత్రుల వద్ద శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.