హాలీవుడ్ లో 2013లో అత్యధిక సంపాదన వెనకేసుకున్న నటి ఆస్కార్ విజేత జెన్నిఫర్ లారెన్స్ అని క్వింగ్లీ పబ్లిషింగ్ కంపెనీ వెల్లడించింది. అయితే ఆమె ఎంత సంపాదించిందన్న విషయం మాత్రం తెలపలేదు. ఆమె తరువాతి స్థానాల్లో శాండ్రాబుల్లక్, బ్రాడ్లీ కూపర్ నిలిచారని క్వింగ్లీ వెల్లడించింది. 2013లో అత్యంత ప్రభావశీలురైన మహిళల్లో జెన్నిఫర్ లారెన్సే అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా జెన్నిఫర్ చేతిలో ప్రతిష్ఠాత్మక ఆఫర్లు చాలా ఉన్నాయి. దీంతో సంపాదనలో ఆమెను దాటి ముందుకెళ్లగల నటి ఇప్పట్లో లేనట్టేనని హాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.