ఢిల్లీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హామీల అమలులో మరో అడుగు ముందుకేశారు. విద్యుత్ కంపెనీల లెక్కలను తనిఖీ చేయాలని అధికారులకు కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల్లో భాగంగా తొలుత ఒక్కో ఇంటికి నెలకు 20 వేల లీటర్ల శుద్ధి చేసిన మంచినీటి సరఫరా పథకం అమలుకు ఆయన ఆదేశాలిచ్చారు. జ్వరంతో బాధపడుతున్నా ఆయన ఇంటి వద్ద నుంచే ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారు. అనారోగ్యంగా ఉన్నా.. రెండో హామీని నెరవేర్చే పనిలో పడ్డారు.