జనవరి 7న హైదరాబాద్ లో మహాధర్నా నిర్వహించనున్నామని టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ బిల్లును అసెంబ్లీలో తక్షణం ఆమోదించాలని డిమాండ్ చేశారు. బిల్లులో కొన్ని సవరణలు చేయాలని ఆయన రాష్ట్రపతిని కోరినట్టు తెలిపారు. దశాబ్దాలుగా తాము తెలంగాణ కోసం ఎదురు చూశామని, ఇప్పటికైనా తెలంగాణ ప్రజల కోరిక నెరవేరాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.