ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను వివాదాలు వెంటాడుతున్నాయి. దుర్గా శక్తి నాగ్ పాల్ వ్యవహారం దేశ వ్యాప్తంగా వివాదాన్ని రేపితే, తరువాత ముజఫర్ నగర్ అల్లర్లు ఉన్న ప్రతిష్ఠను కాస్తా దిగజార్చాయి. ముజఫర్ నగర్ శిబిరాల్లో 34 మంది చిన్నారులు నెమ్ముతో మృతి చెందడం తీవ్ర విమర్శల్ని రేపింది. అక్కడ చిన్నారుల రక్షణ చర్యలు కానీ, శిబిరాల్లో వసతుల మెరుగు చర్యలు కానీ చేపట్టని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, తన స్వగ్రామంలో జరిగిన సెఫాయ్ మహొత్సవ్ లో పాల్గొనడం సర్వత్ర విమర్శల్ని మూటగట్టుకుంటోంది.
కుటుంబసభ్యులు, ప్రముఖులను తీసుకుని ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కోట్లు ఖర్చుపెట్టి గానాభజానాలు ఏర్పాటు చేయించారు. మరో వైపు రెండు వందల కోట్ల రూపాయలతో ఆయన స్వగ్రామంలో స్విమ్మింగ్ పూల్ నిర్మించనున్నారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. శరణార్థుల బాగు చర్యలు చేపట్టకుండా ముఖ్యమంత్రి స్విమ్మింగ్ పూల్ నిర్మాణం, పండుగలు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.