ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్(43) తొడగొట్టి ఒక సవాల్ విసిరారు. మోడీని అమేథిలో రాహుల్ పై పోటీకి దింపాలని.. తాను కూడా అక్కడ పోటీ చేస్తానని, విజయం ఎవరిని వరిస్తోందో చూద్దామని ప్రకటించారు. రాహుల్ పై అమేథిలో పోటీ చేస్తానని విశ్వాస్ గత కొంతకాలంగా ఉత్సాహాన్ని ప్రకటిస్తూనే ఉండగా.. తాజాగా మోడీని కూడా అమేథికి రా తేల్చుకుందామని ఆహ్వానించడమే విశేషం.