తాము చెప్పినవన్నీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సావధానంగా విన్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతిని కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్టు చెప్పారు. అనంతరం తాము ఇచ్చిన విజ్ఞప్తులను స్వీకరించారని ఆయన తెలిపారు.