దానం చేయడం అంటే మన చేతిలో ఉన్న దాంట్లో కొంతమేర లేనివారికి ఇవ్వడంగా మనం చెప్పుకుంటాం. అలాకాకుండా అయాచితంగా వచ్చిన దాన్ని అలా దానం చేసేస్తే... అది కూడా కోట్ల మొత్తాన్ని... అలాంటి దాతనేమనాలి? సరిగ్గా ఇలాంటి దానాన్నే చేశాడొకవ్యక్తి. తనకు లాటరీలో లభించిన కోట్ల మొత్తాన్ని విరాళంగా దానం చేశాడు.
టామ్ క్రైస్ట్ అనే వ్యక్తి భార్య జాన్ కేన్సర్‌తో మరణించింది. టామ్ ఈకోల్ ఎలక్ట్రిక్ కంపెనీలో సీఈవోగా బాధ్యతలను నిర్వహిస్తూ గత సెప్టెంబరులో ఉద్యోగ విధులనుండి తప్పుకున్నాడు. ఆయన లాటరీలో 4 కోట్ల డాలర్లు అంటే సుమారు 248 కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు. అంత పెద్ద మొత్తాన్ని గెలుచుకుంటే ఎవరికైనా సంతోషం వేస్తుంది. కానీ టామ్ తాను గెలుచుకున్న మొత్తాన్ని కేన్సర్‌తో బాధపడేవారికి సాయమందించేందుకు కృషి చేసే కేన్సర్ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చేశాడు.
ఈ దానానికి సంబంధించిన విషయాన్ని తన కుమారులకు కూడా చెప్పకుండా రహస్యంగా ఉంచేశాడు. మొత్తం డబ్బులో కొంతభాగాన్ని తన భార్యకు చికిత్స అందించిన టామ్ బేకర్ సెంటర్‌కు ఇచ్చి మిగిలిన దాన్ని స్వచ్ఛంద సంస్థలకు అందజేశాడు. మొత్తానికి అయాచితంగా లభించిన దాన్ని ఇలా దానం చేసి తన దాతృత్వాన్ని, తన భార్యపై ప్రేమను చాటుకున్నాడు.