'నాన్నా... పందులే గుంపుగా వస్తాయి' అంటూ ఒక సినిమాలో హీరో డైలాగ్ చెబుతాడు. కానీ గుంపు సంగతేమోగాని ఒక్క పంది వున్నా చాలు... ఇంట్లో రాత్రిపూట లైటు వేసుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే, అది చీకట్లో మెరుస్తుంది కాబట్టి. ఇలాంటి పందిపిల్లలను రాత్రిపూట చూస్తే తెలియని వారు గుండాగి చస్తారేమో! పంది మెరవడం ఏంటి? అని మీకు అనుమానం వచ్చిందా...? ఇలా పందిపిల్లలను మెరిసేలా శాస్త్రవేత్తలు తయారుచేశారు.
చైనాకు చెందిన శాస్త్రవేత్తలు జెల్లీ చేప డీఎన్ఏను ఉపయోగించి రాత్రిపూట పందిపిల్లలు మెరిసేలా చేశారు. పందిపిల్లలు పగటిపూట మామూలుగా కనిపిస్తాయి. కానీ, రాత్రి కాగానే అవి మెరుపులీనడం ప్రారంభిస్తాయి. అదికూడా ఆకర్షణీయంగా ఉండే ఆకుపచ్చ కాంతితో మెరుస్తాయి. జెల్లీచేప డీఎన్ఏ నుండి తీసిన ఒక ప్రోటీనును పందుల్లోకి ఎక్కించడం మూలంగా సంభవించిన జన్యుమార్పే చీకట్లో పందిపిల్లలు మెరిసిపోవడానికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చీకట్లో అందమైన ఆకుపచ్చని ఫ్లోరసెంట్ కాంతిని విరజిమ్మే ఈ పందిపిల్లలు చాలా ముచ్చటగా ఉన్నాయని టర్కీలో ఇలాంటివే పచ్చగా తళుకులీనే కుందేళ్లను తయారుచేశామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.