ప్రతి ఒక్కరూ అన్నా హజారే వలే అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కోరారు. అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తానని, దేశ సంపదను కాపాడతానని, నేర ప్రవృత్తికి పాటుపడనని సభకు హాజరైన అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. మీడియా వారు కూడా ప్రతిజ్ఞ చేయాలని ఆయన కోరారు. లోక్ పాల్ బిల్లు తామే తెచ్చామని కాంగ్రెస్ డబ్బాలు కొట్టుకుంటోందని ఎద్దేవా చేశారు. ముందు సోనియా తన కుటుంబంలోని అవినీతి అనకొండలను, పార్టీలోని అనకొండలను తరిమికొట్టాలని మండిపడ్డారు. అవినీతిపరుల ఆస్తులను జప్తు చేసిన తర్వాత... సోనియా మాట్లాడాలని సూచించారు.