అసహజ లైంగిక కార్యమైన స్వలింగ సంపర్కానికి వ్యతిరేకంగా పలు మతాల నేతలు ఐక్యంగా ఉద్యమించనున్నారు. స్వలింగ సంపర్కం నేరమేనని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా.. దానిని సమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మతనేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున ఢిల్లీలో జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది.
ఇండియన్ ఇస్లామిక్ కల్చరల్ సొసైటీ భవనంలో జరిగే ఈ సమావేశంలో ప్రయాగ పీఠం శంకరాచార్య ఓంకారనాథ సరస్వతి, అకల్ తక్త్ జతేందర్ సింగ్ సాహెబ్ గురువచన్ సింగ్, అహింసా విశ్వ ధర్మకు చెందిన ఆచార్య డాక్టర్ లోకేష్ ముని, ఫాదర్ ఎండీ థామస్ తదితరులు పాల్గొంటున్నారు. స్వలింగ సంపర్కం చట్ట వ్యతిరేకమే కాదు.. భారతీయ సంస్కృతికి కూడా వ్యతిరేకమేనని జమాతే ఇస్లామీ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ జలాలుద్దీన్ అన్నారు.