హైదరాబాదులోని కేబీఆర్ పార్కు వద్ద పాలెం బస్సు ప్రమాద బాధితులు కొద్దిసేపటి క్రితం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. పాలెం సమీపంలో వోల్వో బస్సు దగ్ధమై.. 45 మంది సజీవ దహనమైన విషయం విదితమే. ప్రమాదం జరిగి రెండు నెలలు పూర్తవుతున్నా.. ఇంతవరకు ప్రభుత్వం బాధ్యులను అరెస్ట్ చేయలేదని వారు ఆరోపించారు. తమకు కనీసం నష్ట పరిహారం విషయంలో కూడా అన్యాయమే జరిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ప్రజా సంఘాలు ర్యాలీలో పాల్గొని బాధితుల కుటుంబాలకు బాసటగా నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని వారు దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజా ఆగ్రహాన్ని చవి చూడక తప్పదని వారు హెచ్చరించారు.