చిన్న పిల్లలు కదా... వాళ్లేం ఆలోచిస్తారు... అని చాలామంది భావిస్తుంటారు. కానీ వయసు చిన్నదే అయినా వారి బుద్ధికుశలత మాత్రం అమోఘం అంటున్నారు పరిశోధకులు. చిన్న వయసు అయినంత మాత్రాన వారు కొన్ని విషయాల్లో తల్లిదండ్రులు చెప్పింది గుడ్డిగా చేసేయరని, కొన్నిసారు ఆలోచించి తాము సొంతంగా నిర్ణయాలను తీసుకుంటారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మూడేళ్ల వయసున్న చిన్న పిల్లలు సహజంగా పెద్దలు చెప్పింది చేస్తారనే అందరం అనుకుంటాం. కానీ ఆ వయసు నుండే పిల్లల్లో ఆలోచనా శక్తి ప్రారంభమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
చిన్న పిల్లల్లో ఆలోచనా శక్తి గురించి పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఇందుకోసం కొందరు పిల్లలను ఎంపిక చేసుకుని, వారిని నాలుగు జంటలుగా విభజించి పరిశీలించారు. పిల్లలకు అక్కడున్న పగిలిపోయిన కప్పు ఇలా ఇవ్వు, అందులో నీరు పోయాలి అని పెద్దలు చెప్పినా కూడా చిన్న పిల్లలు పక్కనే ఉన్న మంచి కప్పునే తీసుకువచ్చి అందించిన వైనం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ పిల్లలలో ఒక జంటకు ఇలా పగిలిన కప్పుతోబాటు బాగా ఉన్న కప్పు, మరొకరికి పనిచేస్తున్న పెన్నుతోబాటు పనిచేయని దాన్ని కూడా ఇచ్చారు. ఇంకొకరికి అసలైన సుత్తి, బొమ్మసుత్తి, మరో జంటకు మామూలు సెల్‌ఫోన్, ప్లాస్టిక్ సెల్‌ఫోన్‌ను ఇచ్చారు.
తర్వాత నీరుపోయడానికి కప్పు ఇవ్వాల్సిందిగాను, నోట్‌బుక్‌పై రాయాల్సిందిగాను, గోడమీద కొట్టాల్సిందిగాను, ఫోన్‌కాల్ చేయాల్సిందిగాను చెప్పారు. ఇందుకు ఆయా చిన్నారులు స్పందించిన తీరు ఎంతో ముచ్చటగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. వీరిలో మూడింట రెండు వంతులమంది తాము చెప్పిన పనిచేయడానికి కచ్చితమైన వాటినే వాడినట్టు పరిశోధకులు చెబుతున్నారు.