రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఈ రోజు హైదరాబాద్ లో పలువురు రాజకీయ ప్రముఖులు కలవనున్నారు. వారందరికీ ఇప్పటికే అపాయింట్ మెంట్ ఇవ్వడంతో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వద్ద క్యూ కట్టనున్నారు. ముందుగా 11.30 గంటలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ బృందంతో కలిసి రాష్ట్రపతిని కలుస్తారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కాంగ్రెస్ ఎంపీ అజారుద్దీన్ ప్రణబ్ ను కలవనున్నారు. అటు వెంటనే 1.15 గంటలకు కేంద్రమంత్రి పురంధేశ్వరి భేటీ అవుతారు. సాయంత్రం 6 గంటలకు హైకోర్టు చీఫ్ జస్టిస్ కలుస్తారు. ఇక రాత్రి ఎనిమిది గంటలకు 35 మంది నేతలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రపతిని కలుస్తారు.