భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాసేపట్లో భారత వాయుసేన విమానంలో హైదరాబాదు నుంచి అనంతపురం బయలుదేరి వెళ్లనున్నారు. అనంతపురంలో ఆయన భారత మాజీ రాష్ట్రపతి దివంగత నీలం సంజీవరెడ్డి శత జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కూడా వెళుతున్నారు. వీరు 11.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయంలో దిగి... అక్కడ నుంచి హెలికాప్టర్ లో అనంతపురం చేరుకుంటారు. అనంతలో సంజీవరెడ్డి ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 1.50 గంటలకు తిరిగి పుట్టపర్తి చేరుకుని... సత్యసాయి సమాధిని సందర్శించుకుంటారు. ఆ తర్వాత వీరంతా సాయంత్రం 3 గంటలకు పుట్టపర్తి నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.