రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్య ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్టు గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) జేఏసీ ప్రకటించింది. అందులో భాగంగా గురువారం నుంచి 72 గంటల పాటు అత్యవసర సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నగరంలో మంచినీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం లాంటి సేవలు రేపటి నుంచి నిలిచిపోనున్నాయి.